News February 25, 2025
నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి మహిళ దారుణ హత్య

నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో దారుణ హత్య జరిగింది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాలు.. పెద్దగుమ్మడం గ్రామానికి చెందిన కుట్ర లక్ష్మమ్మ(45) ఇంట్లో నిద్రిస్తుండగా సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు మెడపై, తల భాగంపై దారుణంగా నరికి హత్య చేసి పరారయ్యారు. గుడిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 25, 2025
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్పేట్కు చెందిన గూడూరు చంద్రశేకర్, మత్సగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News February 25, 2025
NLG: క్విజ్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే!

☞ఎవరికాలంలో నల్గొండ <<15559629>>నీలగిరిగా <<>>ప్రసిద్ధి చెందింది? – శాతవాహనులు
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? – ఆచార్య వినోబా భావే
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు? – వట్టి కోట ఆళ్వారుస్వామి
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం? – భువనగిరి మం. బొల్లేపల్లి
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు? – సుద్దాల హనుమంతు
SHARE IT..
News February 25, 2025
NLG: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.