News July 9, 2024
నల్గొండ జిల్లాలో ఆర్టీసీ డీఎంల బదిలీ

నల్గొండ ఆర్టీసీ రీజియన్‌లో పలువురు డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిర్యాలగూడ డీఎం బొల్లెద్దు పాల్‌ను ఆదిలాబాద్, నిజాంబాద్, కరీంనగర్ రీజియన్ల కార్గో ఏటీఎంగా, నల్గొండ డీఎం రామ్మోహన్ రెడ్డిని మిర్యాలగూడకు, రాజేంద్రనగర్ డీఎం ఎం.శ్రీనాథ్‌ను నల్గొండకు బదిలీ చేశారు. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న దేవరకొండ డిపో డీఎం స్థానాన్ని టి.రమేష్ బాబుతో భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 1, 2026
నల్గొండ: ఉచిత బ్యూటీషియన్ కోర్సు.. దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. మార్చి 4వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ కోర్సుకు 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 18 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు అర్హులు. ఆసక్తి గలవారు తమ విద్యా అర్హత పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ప్రాంగణంలో సంప్రదించాలని మేనేజర్ అనిత తెలిపారు.
News March 1, 2026
NLG: సెగలు పుట్టిస్తున్న భానుడు

నల్గొండ జిల్లాలో ఈ ఏడాది వేసవి సెగలు ముందే మొదలయ్యాయి. సాధారణంగా మార్చిలో ఉండే ఎండలు ఫిబ్రవరి చివరి వారంలోనే కనిపిస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 1, 2026
దేవాలయాల పాలకవర్గాలకు నోటిఫికేషన్

దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న NKP, CTL మండలాల్లోని పలు దేవాలయాలకు పాలకవర్గాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించారు. NKP మండలంలో NKP ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి, రామలింగేశ్వరస్వామి, ఎం.ఎడవెల్లిలోని హనుమాన్, షాపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి, మాండ్రలోని శ్రీ ఆంజనేయస్వామి CTL మండలం పేరుపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయ పాలకవర్గాల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది.


