News April 4, 2024

నల్గొండ జిల్లాలో కరవు రాజకీయం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం కరవు చుట్టూ తిరుగుతోంది. సాగర్ కాల్వతో పాటు బోరు బావుల కింద పంటలు ఎండిపోవడానికి కారణం గత ప్రభుత్వమే అని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. తమ హయాంలో నీళ్లు ఇచ్చామని చెబుతూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మరి మీరేమంటారు.

Similar News

News February 11, 2026

నల్గొండలో మరి కాసేపట్లో పోలింగ్‌

image

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సహా మిర్యాలగూడ, చండూరు,హాలియా, దేవరకొండ, నందికొండ,చిట్యాల పురపాలికల్లో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 162 వార్డుల పరిధిలో 475 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 3,09,097 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News February 10, 2026

ఇందిరమ్మ ఇళ్లు వెంటనే పూర్తి చేయాలి: గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ

image

నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. నల్గొండ కలెక్టరేట్‌లో ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇళ్ల అప్పగింతకు ముందే విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి సౌకర్యాలు 100 శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు.

News February 10, 2026

మున్సిపల్‌ సమరానికి సర్వం సిద్ధం: నల్గొండ కలెక్టర్‌

image

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. ఈనెల 11న జరిగే ఎన్నికల సరళిపై మంగళవారం ఆయన ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌తో కలిసి సమీక్షించారు. జిల్లాలో నల్గొండ కార్పొరేషన్‌తో పాటు మిర్యాలగూడ, చండూరు, చిట్యాల, నందికొండ, హాలియా, దేవరకొండ మున్సిపాలిటీల్లో మొత్తం 473 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.