News January 24, 2025

నల్గొండ జిల్లాలో గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

image

నల్గొండ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 9:30 గంటలకు బాల బాలికల సాంస్కృతిక విన్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం శకటాల ప్రదర్శన జరుగుతుందని అధికారులు తెలిపారు.

Similar News

News October 20, 2025

నల్గొండ: రేకుల షెడ్‌లో ఉంటున్నాం.. ఇల్లు ఇవ్వరూ..!

image

త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు దక్కడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా నాయకులు అనర్హులకు ఇళ్లను కేటాయించి తమను విస్మరిస్తున్నారని కొల్లి సరస్వతి, దుర్గయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేకుల షెడ్‌లో నివసిస్తున్నామని, అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

News October 19, 2025

NLG: జిల్లాలో ఇక భూ సర్వేలు చకచకా!

image

ఇక భూ సర్వేలు చకచకా కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 17 మంది ప్రభుత్వ సర్వేయర్లు, ముగ్గురు డిప్యూటీ సర్వేయర్లు, ఆరుగురు కమ్యూనిటీ సర్వేయర్లు మొత్తం 26 మంది మాత్రమే ఉన్నారు. లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకంతో సర్వేయర్ల కొరత తీరనుంది. ఇప్పటికే లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో తొలి విడత శిక్షణకు ఎంపికైన లిస్టును తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసింది.

News October 19, 2025

నల్గొండ: 23 వరకు గడువు.. 27న డ్రా

image

నల్గొండ జిల్లాలో 154 వైన్స్‌లకు 4,619 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న ఏకంగా 2, 180 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు చొప్పున రూ. 138.57 కోట్లు ఆదాయం సమకూరింది. గత పాలసీలో 155 వైన్స్‌లకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున రూ. 141.14 కోట్ల ఆదాయం లభిచింది. 23 వరకు గడువు పొడిగించడంతో దరఖాస్తులు పెరిగే అవకాశముంది. 27డ్రా తీయనున్నారు.