News June 29, 2024
నల్గొండ జిల్లాలో పడిపోతున్న బీఆర్ఎస్..!

బీఆర్ఎస్ బలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంతకంతకూ పడిపోతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన సర్పంచ్, MPTC, ZPTCఎన్నికల్లో అత్యధికం BRS కైవసం చేసుకుంది. పురపాలిక ఎన్నికల్లోనూ 19 పురపాలికల్లో అన్నింట్లోనూ ఆ పార్టీకి చెందిన వారే ఛైర్మన్లుగా గెలిచారు. 3 ZPలను సైతం కైవసం చేసుకుంది. ప్రస్తుతం కేవలం SRPT, NKL, పోచంపల్లి, చండూరులో మాత్రమే BRSకుచెందిన వారు ఛైర్మన్లుగా ఉండగా..మిగతా చోట్లా కాంగ్రెస్ వారు ఉన్నారు.
Similar News
News November 17, 2025
చలికి గజ గజ.. మంటలతో ఉపశమనం..!

నల్గొండ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి చల్లని గాలులు వీచడం ప్రారంభమై తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఈ చలి ప్రభావం అధికంగా ఉంది. అనేక చోట్ల చలి నుంచి ఉపశమనం పొందడానికి గ్రామాలలో ఎక్కువ శాతం మంటలు వేసుకుంటున్నారు.
News November 17, 2025
సమ్మె వద్దు.. సమస్యలు పరిష్కరిస్తాం: నల్గొండ కలెక్టర్

పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మె విరమించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా తాము రాష్ట్ర అసోసియేషన్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని జిన్నింగి మిల్లుల యజమానులు కలెక్టర్కు తెలిపారు.
News November 17, 2025
మునుగోడు: తెలుగు ఉపాధ్యాయుడి సస్పెన్షన్

మునుగోడు(M) పలివెల జడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు గేర నరసింహను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. 4 రోజుల క్రితం ఆ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థి హనుమాన్ మాల వేసుకుని పాఠశాలకు రాగా సదరు ఉపాధ్యాయుడు అసభ్యంగా మాట్లాడడంతో పాటు మాలతీసి పాఠశాలకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రాథమిక విచారణ చేసిన అనంతరం ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.


