News March 12, 2025
నల్గొండ జిల్లాలో పలువురు సీఐలు బదిలీలు

నల్గొండ జిల్లాలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. చండూరు, నాంపల్లి సర్కిల్ పరిధిలోని సీఐలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి బదిలీ చేశారు. మహబూబ్‌నగర్ మల్టీ జోన్ పరిధిలో వెయిటింగ్‌లో ఉన్న కె.ఆదిరెడ్డిని నాంపల్లి సీఐగా బదిలీ చేశారు. నల్గొండ ట్రాఫిక్ సీఐగా పని చేస్తున్న రాజుకు చండూరు సీఐగా పోస్టింగ్ ఇచ్చారు. నల్గొండ ఎస్బీ సీఐ శివ శంకర్‌ను కోదాడ టౌన్ సీఐగా బదిలీ చేశారు.
Similar News
News March 19, 2025
NLG: లక్ష ఎకరాలకు సాగునీరు.. 107 గ్రామాలకు తాగునీరు

ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 94 గ్రామాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు, ఫ్లోరైడ్ సమస్య ఉన్న 107 గ్రామాలకు తాగునీటిని అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 6.70 TMCల నీటిని బ్రాహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు లిఫ్ట్ చేస్తామన్నారు.
News March 19, 2025
NLG: చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలి

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు కోసం అర్హత గల చేనేత కార్మికులకు నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ డైరెక్టర్ ఎస్.ద్వారక్ తెలిపారు. చేనేత, డిజైన్ వృత్తిలో పని చేస్తున్న వారికి ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికీ రూ.10 వేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపిక బహుకరిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News March 19, 2025
తుపాకి చేతబట్టిన తొలి మహిళ మల్లు స్వరాజ్యం

తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టిన తొలి మహిళ మల్లు స్వరాజ్యం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మం. కొత్తగూడెంలో 1931లో భూస్వాముల కుటుంబంలో పుట్టిన ఆమె నైజాం సర్కార్‌కి వ్యతిరేకంగా పోరాడారు. దొరల దురహంకారంపై తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. సాయుధ పోరాటంలో తన అన్న నర్సింహారెడ్డితో కలిసి పోరాడిన ధీరవనిత మల్లు స్వరాజ్యం. 1978, 1983లో తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. నేడు మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి.