News August 12, 2024
నల్గొండ జిల్లాలో పశు సంపద లెక్క తగ్గింది!

నల్గొండ జిల్లాలో పశు సంపద ఏటేటా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఐదేళ్ల క్రితం పోల్చితే ఈసారి లెక్క తగ్గింది. గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం చేపట్టకముందు జిల్లాలో ఉన్న గొర్రెలు మేకల సంఖ్య కంటే పథకం అమలు చేశాకే తక్కువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలోని 31 మండలాల్లో 9,12,625 గొర్రెలు ఉండగా, 3,36,182 మేకలు ఉన్నట్లు తేలింది. రాయితీపై పంపిణీ చేసిన గొర్రెలు లెక్కలోకి రావడం లేదు.
Similar News
News December 3, 2025
మిర్యాలగూడలో అత్యధికం.. అడవిదేవులపల్లిలో అత్యల్పం..!

మిర్యాలగూడ నియోజకవర్గంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల పర్వం ముగిసింది. మిర్యాలగూడ మండలంలో అత్యధికంగా 360 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించగా, అతి తక్కువగా అడవిదేవులపల్లి మండలంలో కేవలం 101 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు.
News December 3, 2025
నల్గొండ: తపాలా శాఖకు కలిసొచ్చిన పంచాయతీ ఎన్నికలు!

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు తపాలా శాఖకు కలిసొచ్చాయి. నల్గొండ, చండూరు డివిజన్లలో ఈనెల 11న, 14న మిర్యాలగూడ, 17న దేవరకొండ డివిజన్లో ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో నామినేషన్లు స్వీకరించారు. మూడో విడత నామినేషన్లు నేటి నుంచి స్వీకరిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు కొత్త ఖాతాలు సమర్పించాల్సి ఉండడంతో పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాలు తెరిచేందుకు బారులు తీరుతున్నారు.
News December 3, 2025
నల్గొండ: గ్రామ పంచాయతీలకు ఊరట..!

నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని బకాయిలు వసూళ్లు కావడంతో గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థులు ఇంటి పన్ను, నల్లా బకాయిలు చెల్లించి నామినేషన్ ఫారంకు రశీదు జతచేయాలని నిబంధన ఉండడం పంచాయతీలకు వరంగా మారింది. బకాయి బిల్లులు వసూలు కావడంతో పంచాయతీలకు కొంత ఊరట లభించింది. జిల్లా వ్యాప్తంగా 869 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.


