News April 4, 2024
నల్గొండ జిల్లాలో భానుడి భగభగ

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఈ క్రమంలో నల్గొండ జిల్లా అత్యధికంగా నిడమనూరులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ సమయాల్లో పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News December 3, 2025
నల్గొండ: గ్రామ పంచాయతీలకు ఊరట..!

నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని బకాయిలు వసూళ్లు కావడంతో గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థులు ఇంటి పన్ను, నల్లా బకాయిలు చెల్లించి నామినేషన్ ఫారంకు రశీదు జతచేయాలని నిబంధన ఉండడం పంచాయతీలకు వరంగా మారింది. బకాయి బిల్లులు వసూలు కావడంతో పంచాయతీలకు కొంత ఊరట లభించింది. జిల్లా వ్యాప్తంగా 869 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
News December 3, 2025
నల్గొండ: నేడు ఉపసంహరణకు ఆఖరు!

మొదటి విడత ఎన్నికలు జరిగే నల్గొండ, చండూరు డివిజన్లోని 14 మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణలపై పార్టీలు దృష్టి పెట్టాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన అభ్యర్థి మినహా మిగతా వారితో నామినేషన్ విత్ డ్రా చేయించేలా నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా వెల్లడి కానుంది.
News December 3, 2025
ఆ వివరాలు ఇవ్వకుంటే.. ఇదే జరుగుద్ది: నల్గొండ కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా లెక్కలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పోలింగ్ వరకు ఎంత డబ్బు ఖర్చు చేశారో వాటికి సంబంధించిన ఆధారాలతో కూడిన వివరాలను ఎన్నికల అధికారులకు అందించాలన్నారు. లేదంటే గెలిచిన వారు పదవులు కోల్పోతారన్నారు. మూడేళ్లపాటు పోటీకి అనర్హులు అవుతారని, ఓడిన వారు కూడా ఇవ్వాల్సిందేనని తెలిపారు.


