News May 26, 2024

నల్గొండ జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

NLG- KMM -WGL ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్‌లో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండొద్దని కలెక్టర్‌ దాసరి హరిచందన పేర్కొన్నారు. పోలింగ్‌ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల ఎడమ చేయి మధ్య వేలికు సిరా గుర్తు పెట్టాలని సూచించారు. ఎన్నికల సంఘం సరఫరా చేసిన స్కెచ్‌ ద్వారా మాత్రమే ఓటర్లు ఓటు వేయాలన్నారు. ఓటు వేసిన తర్వాత ఎవరైనా ఫొటో తీస్తే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Similar News

News November 16, 2025

నల్గొండ జిల్లాలో చలి పులి పంజా

image

జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతుంది. ఐదు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 – 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రెండు మూడు రోజులు జిల్లాలో శీతల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాత్రి, పగలు శీతల గాలులు వీస్తుండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో జనం బయటకు రాని పరిస్థితులు నెలకొన్నాయి.

News November 16, 2025

NLG: బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్

image

గత నెల కురిసిన భారీ వర్షాల కారణంగా పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (చెరువు) కింద దెబ్బతిన్న అన్ని పనులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి కొండమల్లేపల్లి మండలం, పెండ్లిపాకల రిజర్వాయర్‌ను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసి త్వరలోనే మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.

News November 15, 2025

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను కఠినంగా ఆదేశించారు. శనివారం ఆమె గృహ నిర్మాణ శాఖ పీడీ, ఆర్డీవోలు, తహసిల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పూర్తయిన ఇండ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.