News March 5, 2025
నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు అదృశ్యం

నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి గొల్లగూడలో మూడేళ్ల బాలుడు అదృశ్యమైనట్లు పట్టణ టూ టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. పట్టణ ఆయన తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి గొల్లగూడలో మూడేళ్ల బాలుడు అబ్దుల్ అహ్మద్ (అబ్బు) ఆడుకుంటూ తప్పిపోయాడని తెలిపారు. బాబు ఆచూకీ తెలిసినవారు సెల్ నం.8712670171, 8712667671లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ నాగరాజు పేర్కొన్నారు
Similar News
News March 6, 2025
చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలో చండూరు వాసులు

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనలతో కూడిన వివిధత కా అమృత మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము బుధవారం సాయంత్రం ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 20 మంది చేనేత హస్త కళాకారులు ఈ ప్రదర్శనకు ఎంపిక కాగా నల్గొండ జిల్లా చండూరుకి చెందిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి, జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత చిలుకూరు శ్రీనివాసులు వారిలో ఉండడం విశేషం.
News March 6, 2025
మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడి సూసైడ్

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 6, 2025
NLG: LRSపై అధికారుల ప్రచారం ఫలించేనా?

జిల్లాలో లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన LRS పథకానికి 25 శాతం రాయితీపై పుర అధికారులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఈనెల 31 లోగా LRS పథకం కింద పన్నులు చెల్లించేందుకు ముందుకు వచ్చేవారికి 25 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెవిన్యూ, పురపాలక శాఖల ప్రమేయం లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే LRS చెల్లింపులు చేసేందుకు ఉన్నతాధికారులు అవకాశం కల్పించారు.