News March 12, 2025
నల్గొండ జిల్లా వాసుల ఎదురుచూపు..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో NLG జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో పరిశ్రమలు, మునుగోడులో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాల పూర్తి చేయాల్సి ఉంది. కట్టంగూరు మండలం ఆయిటి పాముల ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
Similar News
News March 13, 2025
వైద్య సిబ్బంది డిప్యుటేషన్లు రద్దు: కలెక్టర్

నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇతర ప్రాంతాలలో డిప్యుటేషన్‌లో ఉన్న వారి డిప్యూటేషన్లను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలపై జిల్లా కలెక్టర్ బుధవారం తన ఛాంబర్లో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ శివరాం ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు.
News March 12, 2025
సంకల్ప్ అమలుకు ప్రణాళిక రూపొందించాలి: అదనపు కలెక్టర్

నైపుణ్య, శిక్షణ కార్యక్రమాల అమలు కోసం పక్కా ప్రణాళికలు రూపొందించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జే. శ్రీనివాస్ అధికారులకు సూచించారు. ‘స్కిల్ అక్విజిషన్, నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీ హుడ్ ప్రమోషన్’ (సంకల్ప్) కార్యక్రమంపై జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధ్వర్యంలో సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షలో అయన మాట్లాడారు. సమావేశంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ పాల్గొన్నారు.
News March 12, 2025
భువనగిరి జిల్లాలో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.