News March 21, 2025
నల్గొండ: టోల్ విధించే ప్రసక్తే లేదు: మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్ర రహదారులకు, గ్రామీణ రోడ్లకు టోల్ విధించే ఆలోచనే లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో సిద్దిపేట MLA హరీశ్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామన్నారు. కాగా, రోడ్లపై చర్చ జరుగుతున్న సందర్భంగా తమ వద్ద రోడ్లు సరిగ్గా లేక అబ్బాయిలకు పిల్లనిచ్చే పరిస్థితి లేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ నవ్వుతూ అన్నారు.
Similar News
News April 1, 2025
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: వెంకట్ రెడ్డి

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కనగల్ మండలం జి.యడవల్లి గ్రామంలోని ఎన్.వి.కె ఫంక్షన్ హాల్ హాల్‌లో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఐ.కె.పి సెంటర్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు.
News April 1, 2025
BREAKING: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. గుర్రంపోడులో ఆలయ వార్షికోత్సవానికి వచ్చి వెళ్తుండాగా వద్దిరెడ్డిగూడెం వద్ద కాన్వాయ్‌లో గన్‌మెన్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో వాహనం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలగా మంటలు చెలరేగాయి. ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 1, 2025
NLG: ఆన్‌లైన్‌లో పేరు ఉన్నా.. సన్న బియ్యం!

కొత్తగా రేషన్ కార్డులు మంజూరై పౌరసరఫరాల శాఖ పోర్టల్లో పేర్లు ఉన్న వారికి కూడా సన్న బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నూతనంగా కార్డులు జారీ కాకున్నా పోర్టల్లో పేర్లు ఉన్న వారికి సైతం సన్న బియ్యం అందనున్నాయి. ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ ఆ మేరకు పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.