News April 10, 2025
నల్గొండ: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 11,15,16 తేదీలలో జరుగబోయే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా పరీక్షలు యధావిధిగా టైం టేబుల్ ప్రకారం జరుగుతాయన్నారు.
Similar News
News November 14, 2025
అటవీ భూముల సంరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్

అటవీ భూముల సంరక్షణ అందరి బాధ్యత అని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అటవీ భూముల పరిరక్షణను అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. కలెక్టరేట్లో ఈరోజు DFO కృష్ణ గౌడ్, ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. గిరిజనులు పోడు నరకకుండా చూడటం అత్యవసరమని, ఇందుకోసం వారికి తగిన జీవనోపాధి అవకాశాలు కల్పించడం కీలకమని చెప్పారు.
News November 14, 2025
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్లాన్ ఫెయిల్.. డిపాజిట్లు గల్లంతు

పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్ కిశోర్‌కు మంచి పేరుంది. ఎన్నికలు ఏవైనా ఆయన ప్లాన్ చేస్తే ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందనే టాక్ ఉండేది. అయితే ఆ వ్యూహాలు తాను స్థాపించిన జన్ సురాజ్ పార్టీని అధికార పీఠం దగ్గరకు కూడా తీసుకొని వెళ్లలేకపోయాయి. బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మొత్తం 239 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2% ఓటు షేర్ మాత్రమే జన్ సురాజ్‌కు దక్కింది.
News November 14, 2025
బెల్లంపల్లి: పెద్దపులి దాడిలో ఆవు మృతి

బెల్లంపల్లి మండలం బుగ్గగూడ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం సమీప గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రాళ్లవాగు పక్కన ఉన్న పత్తి చేనులో ఆవుపై దాడి చేసిన హతమార్చినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన ఆవు బుగ్గగూడ గ్రామానికి చెందిన ఎల్లక్కదిగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సమీప గ్రామాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


