News April 10, 2025

నల్గొండ: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 11,15,16 తేదీలలో జరుగబోయే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా పరీక్షలు యధావిధిగా టైం టేబుల్ ప్రకారం జరుగుతాయన్నారు.

Similar News

News January 15, 2026

కామారెడ్డి: రేపే అన్ని వివరాలతో కూడిన తుది ఓటర్ల జాబితా

image

కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పూర్తిస్థాయి తుది ఓటర్ల జాబితాను(ఫోటోలతో కూడిన) అన్ని వివరాలతో రేపు అధికారులు ప్రకటించనున్నారు. మొత్తం 92 వార్డుల తుది జాబితాలో పురుషులు, మహిళలు, ఇతరుల వారీగా ఓటర్ల వివరాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే బూత్‌ల వివరాలు, మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లు ప్రకటించగా ఏ వార్డు కు ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.

News January 15, 2026

BREAKING: HYD: అడవిలో విషపు కాయలు తిని చిన్నారులకు అస్వస్థత

image

పటాన్‌చెరు నియోజకవర్గంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు వివరాలు.. రామచంద్రాపురం పరిధి బండ్లగూడలో బిహార్‌కు చెందిన 8 ఏళ్లలోపు ముగ్గురు చిన్నారులు స్థానిక అడవిలోకి వెళ్లారు. అక్కడ చెట్లకు ఉన్న విషపు కాయలు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు గమనించగా అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.