News April 10, 2025
నల్గొండ: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 11,15,16 తేదీలలో జరుగబోయే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా పరీక్షలు యధావిధిగా టైం టేబుల్ ప్రకారం జరుగుతాయన్నారు.
Similar News
News March 5, 2026
ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: మోదీ

దేశాల మధ్య సంఘర్షణను పరిష్కరించడానికి చట్టబద్ధ పాలన, చర్చలు, దౌత్యం ముఖ్యమని PM మోదీ చెప్పారు. రష్యాvsఉక్రెయిన్, US-ఇజ్రాయెల్vsఇరాన్ యుద్ధాలను ప్రస్తావిస్తూ.. ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదన్నారు. ఢిల్లీలో ఫిన్‌లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ కామెంట్లు చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో శాంతి కోసం చేసే ప్రయత్నాలకు సపోర్ట్ చేస్తామని ప్రకటించారు.
News March 5, 2026
NGKL: ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు

నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు నోడల్ అధికారి వెంకట్ రమణ తెలిపారు. గురువారం జరిగిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 6,211 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 5,963 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. 248 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.
News March 5, 2026
ఇరాన్ సంచలన ప్రకటన.. భారత్‌కు గుడ్‌న్యూస్!

హార్ముజ్ నుంచి అన్ని దేశాలకు చమురు సరఫరా నిలిపివేయట్లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో INDతో పాటు మరికొన్ని దేశాలకు భారీ ఊరట లభించింది. త్వరలోనే మన షిప్స్ రవాణా మొదలవ్వొచ్చు. ఇక తమ నౌకాదళంతో హార్ముజ్‌లోని వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తామన్న US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. జలసంధిని నియంత్రించే అధికారం తమకుందని, US, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు ఎంట్రీ ఉండదని తేల్చి చెప్పింది.


