News December 22, 2024
నల్గొండ డీఈవోపై చర్యలకు ఆదేశించిన మహిళా కమిషన్

నల్లగొండ డీఈవో బిక్షపతిపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త, నల్లగొండ డీఈవో బిక్షపతి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని.. ఆయన మొదటి భార్య మాధవి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మాధవి ఫిర్యాదుతో స్పందించిన మహిళా కమిషన్ నల్లగొండ డీఈవో బిక్షపతి వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టింది. ఆయనపై శాకపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీని ఆదేశించింది.
Similar News
News December 9, 2025
గ్రామ పోరుకు సిద్ధం.. ‘నల్గొండలో ఏర్పాట్లు పూర్తి’

జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని దృష్టికి తీసుకెళ్లారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ వివరాలను నిర్ణీత సమయాల్లో ‘టీ-పోల్’లో నమోదు చేయాలని ఈసీ ఆదేశించారు.
News December 9, 2025
ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: నల్గొండ కలెక్టర్

నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను మంగళవారం ఆదేశించారు. కనగల్ ఎంపీడీవో ఆఫీస్, సాయిరాం ఫంక్షన్ హాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ పేపర్లు, బాక్సులను పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల వారీగా సామాగ్రి సిద్ధం చేయాలని, బ్యాలెట్ పత్రాలు, బాక్సులు ప్రాపర్‌గా చెక్ చేయాలని సూచించారు.
News December 9, 2025
ఎన్నికల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం: నల్గొండ ఎస్పీ

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు, స్ట్రైకింగ్ ఫోర్స్‌ను మోహరించామని చెప్పారు. 1141 మంది పాత నేరస్తులు, రౌడీషీటర్లను బైండోవర్ చేసి వారి కదలికలపై నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో గుంపులు, మొబైల్ ఫోన్లు, ప్రలోభపరిచే చర్యలు నిషేధం అని హెచ్చరించారు.


