News April 2, 2025
నల్గొండ: ‘డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు’

ప్రజా పంపిణీ వ్యవస్థలో డీలర్లు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం నల్గొండలోని పలు రేషన్ దుకాణాలు, రైస్ మిల్లులను ఆయన తనిఖీ చేశారు. సన్న బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగితే డీలర్షిప్ రద్దు చేస్తామన్నారు. డీలర్లు నియమ నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదులు ఉన్నాయన్నారు.
Similar News
News December 9, 2025
నల్గొండ జిల్లాలో సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

నల్గొండ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ పోలింగ్‌కు సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల అధికారి కొర్రా లక్ష్మీ, కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో మంగళవారం 7,892 మంది అధికారులకు ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. నల్గొండ, చండూరు డివిజన్లలోని 14 మండలాల్లోని 2,870 కేంద్రాల్లో వీరు విధులు నిర్వహించనున్నారని కలెక్టర్ తెలిపారు.
News December 8, 2025
కేతేపల్లి: మూడుసార్లు సస్పెండ్.. సతీమణికి సర్పంచ్ టికెట్

కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన చిన్నబొస్క ప్రసాద్ గతంలో పలు కారణాలపై మూడుసార్లు (మొత్తం 18 నెలలు) సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ అయ్యారు. గ్రామ సభలు పెట్టలేదని, ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఉప సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేశారని ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈసారి జనరల్ మహిళకు రిజర్వేషన్ రావడంతో, ప్రసాద్ సతీమణి చిన్నబొస్క శైలజ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు.
News December 8, 2025
NLG: మాటల తూటాలు.. స్నేహ బంధాలు!

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఆయా పార్టీలు వైరం మరిచి ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి. చాలా చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల సీపీఎం, బీజేపీ, ఇంకొన్ని చోట్ల బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చిన నేతలు ఇప్పుడు స్నేహబంధం చాటుతూ.. కలిసి ఓట్లు అడుగుతుండటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.


