News March 10, 2025
నల్గొండ: దాసోజు శ్రవణ్ కుమార్ రాజకీయ నేపథ్యం ఇదే..!

సెప్టెంబర్ 7, 1966లో NLG జిల్లాలో జన్మించిన దాసోజు శ్రవణ్ కుమార్.. 2008లో ప్రజారాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సికింద్రాబాద్ లోక్సభ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో పీఆర్పీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా, ఉద్యమకారుడిగా తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు.
Similar News
News November 21, 2025
HYD: చేవెళ్ల హైవేపై మరో ఘోర ప్రమాదం

చేవెళ్ల ట్రాఫిక్ PS పరిధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. మొయినాబాద్లోని తాజ్ సర్కిల్ సమీపంలో కనకమామిడి వెళ్లే రూట్లో 2 కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ములుగు: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు స్పెషల్ ఫండ్!

వామపక్ష తీవ్రవాద ప్రభావిత(LWE)గా గుర్తించిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం రూ.వేల కోట్ల నిధులను ఖర్చు చేసింది. 2014-25 మధ్య కాలంలో ఏకంగా 12 వేల కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను నిర్మించారంటే అతిశయోక్తి కాదు. మౌలిక వసతులు, ఉపాధి, విద్య, వైద్యం కోసం ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చించారు. మారుమూల గ్రామాలలో సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేశారు. నెట్వర్క్ పెరగడంతో మావోల కదలికల గుర్తింపు పోలీసులకు ఈజీ అయ్యింది.