News March 10, 2025

నల్గొండ: దాసోజు శ్రవణ్ కుమార్ రాజకీయ నేపథ్యం ఇదే..!

image

సెప్టెంబర్ 7, 1966లో NLG జిల్లాలో జన్మించిన దాసోజు శ్రవణ్ కుమార్.. 2008లో ప్రజారాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో పీఆర్పీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా, ఉద్యమకారుడిగా తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు.

Similar News

News March 17, 2025

NRPT: ప్రజావాణికి 30 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 30 ఫిర్యాదులు వచ్చాయన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు.

News March 17, 2025

నియోజకవర్గానికి 4-5వేల మందికి సాయం: సీఎం రేవంత్

image

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగులకు అర్హత ప్రకారం అమలు చేస్తామని CM రేవంత్ తెలిపారు. ఒక్కొక్కరికి ₹50వేల నుంచి ₹4లక్షల వరకు మంజూరు చేస్తామన్నారు. ‘రాబోయే 2 నెలల్లో డబ్బులు మీ చేతుల్లో పెడతాం. జూన్ 2న 5లక్షల మంది లబ్ధిదారులను ప్రకటిస్తాం. నియోజకవర్గానికి 4-5వేల మందిని ఎంపిక చేస్తాం’ అని పేర్కొన్నారు.

News March 17, 2025

‘ఫ్యామిలీ రూల్‌’పై అనుష్క శర్మ పోస్ట్.. వైరల్

image

బీసీసీఐ ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ రూల్‌’పై టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పరోక్షంగా స్పందించారు. ‘నువ్వు తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో నీ గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కానీ నువ్వేంటో నీకు మాత్రమే తెలుసు’ అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా టూర్లలో క్రికెటర్లతోపాటు వారి కుటుంబాలు, సన్నిహితులు ఉంటే బాగుంటుందని విరాట్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!