News February 15, 2025

నల్గొండ: నేడు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

image

నల్లగొండ పోలీస్ శాఖ, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం ఎన్జీ కళాశాలలో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. క్రీడాభిమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.

Similar News

News March 12, 2025

సంకల్ప్ అమలుకు ప్రణాళిక రూపొందించాలి: అదనపు కలెక్టర్

image

నైపుణ్య, శిక్షణ కార్యక్రమాల అమలు కోసం పక్కా ప్రణాళికలు రూపొందించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జే. శ్రీనివాస్ అధికారులకు సూచించారు. ‘స్కిల్ అక్విజిషన్, నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీ హుడ్ ప్రమోషన్’ (సంకల్ప్) కార్యక్రమంపై జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధ్వర్యంలో సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షలో అయన మాట్లాడారు. సమావేశంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ పాల్గొన్నారు.

News March 12, 2025

భువనగిరి జిల్లాలో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News March 12, 2025

NLG: GGHలో భద్రత డొల్ల!…

image

NLG ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత కరువైందని రోగులు అంటున్నారు. ఆసుపత్రికి నిత్యం 1,500 మంది అవుట్ పేషెంట్లు, సుమారు 600 వరకు ఇన్ పేషెంట్లు వస్తుంటారన్నారు. పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నా GGHలో భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నట్లు చెబుతున్నారు. కాగా ఇటీవల బాలుడి కిడ్నాప్ ఉందంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

error: Content is protected !!