News February 13, 2026
నల్గొండ: నేడే మున్సిపల్ ఫలితాలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ కార్పొరేషన్‌తో పాటు మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, హుజూర్నగర్, దేవరకొండ, నకిరేకల్, చండూరు, చిట్యాల, హాలియా, నందికొండ, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూర్, చౌటుప్పల్, పోచంపల్లి, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News March 6, 2026
దీదీకి కొత్త తలనొప్పి?

ఎన్నికల వేళ బెంగాల్ గవర్నర్‌గా ఆర్ఎన్ <<19306866>>రవి<<>> రావడంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 2021లో తమిళనాడుకు గవర్నర్‌గా వచ్చిన రవి డీఎంకే ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. రాష్ట్ర పాలసీను విభేదించడం, బిల్లులు ఆమోదించకపోవడం వంటివి చేసి వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్‌గా రవి వైఖరి ఎలా ఉంటుందోనని తృణమూల్ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
News March 6, 2026
మంచిర్యాల: 9న అప్రెంటిస్ షిప్ మేళా

మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 9న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వై.రమేశ్ తెలిపారు. 11 ప్రముఖ కంపెనీలలో మొత్తం 395 ఖాళీలు ఉన్నాయన, శిక్షణ సమయంలో స్టైఫండ్ అందజేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10గంటలకు నిర్వహించనున్న అప్రెంటీషిప్ మేళాకు అర్హులైన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 6, 2026
కర్నూలు: 37,331 పది విద్యార్థులకు బస్ ఫ్రీ

కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించాలని సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 37,331 మంది విద్యార్థులు 160 కేంద్రాల్లో పరీక్షలకు హాజరు కానున్నారు. వీరందరికీ పరీక్షలు జరిగే ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఆర్డీనరీ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుంది.


