News May 20, 2024

నల్గొండ: పట్టు దక్కేది ఎవరికో..

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మసమాజ్ పార్టీ, కొంత మంది స్వతంత్రులు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవరివైపు మొగ్గు చూపుతారో…

Similar News

News October 20, 2025

జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

image

అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రేపు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘స్మృతి పరేడ్‌’ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ప్రజలు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని, అమరులకు నివాళులర్పించాలని ఆయన కోరారు.

News October 20, 2025

NLG: టార్గెట్ రీచ్ అవుతారా..!

image

మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినా మద్యం వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో (4,620) దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది 155 దుకాణాలకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.