News April 6, 2025
నల్గొండ: పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ దంపతులు

నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి దేవాదాయ శాఖ తరఫున జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. కలెక్టర్ నివాసంలో పూజలు చేసి అక్కడ నుంచి మంత్రోచ్ఛరణ, మంగళ వాయిద్యాల నడుమ నూతన పట్టు వస్త్రాలను సీతారామచంద్రస్వామి దేవస్థానానికి తీసుకువెళ్లి స్వామి వారికి సమర్పించారు.
Similar News
News April 11, 2025
భువనగిరి: గంటల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య

గంటల వ్యవధిలో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. రామన్నపేట మండలం నిదానపల్లిలో జింకల అంజి, కావ్య డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కావ్య గురువారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న అంజి పురుగు మందు తాగి చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూశాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News April 11, 2025
సాగర్ కాల్వలకు నీటి నిలిపివేత

గతేడాది డిసెంబర్ 15 నుంచి అధికారులు సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం నీటి విడుదలను నిలిపివేశారు. ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల వరకు సాగవగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగైంది. ఈ సీజన్ లో ఎడమ కాల్వకు 74 టీఎంసీల వాటర్ రిలీజ్ చేయగా, కుడి కాల్వకు 100 టీఎంసీలు విడుదల చేశారు.
News April 11, 2025
నల్గొండ: పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన గుర్రంపోడు మండలం అములూరులో గురువారం సాయంత్రం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా.. మేకల చిన్న రాములు (60) రోజు మాదిరిగానే గొర్రెలను మేపడానికి పొలానికి వెళ్లాడు. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోండగా చెట్టు కింద తలదాచుకున్నాడు. ఈ క్రమంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.