News May 21, 2024
నల్గొండ: పర్మిషన్ ఓ చోట, తవ్వేది మరో చోట
ప్రభుత్వం ఇసుక పాలసీపై స్పష్టమైన విధానాన్ని తీసుకురాకపోవడంతో కొన్ని చోట్ల పాత పద్ధతి ప్రకారం అధికారులు అనుమతులు ఇస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శాలిగౌరారం మండలం వంగమర్తి నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా.. కాంట్రక్టర్ మాత్రం మూసీ అవతలి వైపు ఉన్న సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం పరిధిలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News December 6, 2024
సూర్యాపేట: తలపై బండరాయితో కొట్టి చంపేశారు
సూర్యాపేట జిల్లా మఠంపల్లి (M)లో వ్యక్తిని <<14800753>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసులు, తండావాసుల వివరాల ప్రకారం.. భీమ్లాతండాకు చెందిన పాచ్యానాయక్(32) లారీ డ్రైవర్. కాగా, నిన్న సుల్తాన్‌పూర్ తండా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై కొట్టి హత్య చేశారు. గ్రామానికి చెందిన కొందరితో పాచ్యాకు భూవివాదాలు ఉన్నాయని, గొడవలు జరిగాయని, వారే హత్యచేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదైంది.
News December 6, 2024
యాదాద్రి క్షేత్రంలో నేడు చండీ హోమం
యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ ఉ. 9గం.లకు మహా చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చన్నారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డూ, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.
News December 5, 2024
ఎస్సై ఆత్మహత్య.. ఇన్‌స్టా అమ్మాయే కారణం!
ములుగు(D) వాజేడు SI హరీశ్‌కు సూర్యాపేటకు చెందిన యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆమె గురించి వాకబు చేయగా గతంలో ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేదని తెలిసింది. పెళ్లి ఇష్టంలేదని, సెటిల్మెంట్ కోసం ఆమెను హరీశ్ రిసార్ట్‌కు పిలిచారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో విషయం ఉన్నతాధికారులకు చెబుతానని యువతి బెదిరించింది. దీంతో హరీశ్ సూసైడ్ చేసుకున్నారు.