News June 19, 2024
నల్గొండ: పెట్రోల్ బంకుల్లో మోసాలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని బంకుల్లో మోసాలు జరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ తక్కువగా వస్తోందని, అందులోనూ కల్తీ జరుగుతోందని వినియోగదారులు తరచూ ఆందోళనకు దిగుతున్నా అధికారుల పర్యవేక్షణ కరువైంది. గన్ తీయగా పెట్రోల్ కొట్టకముందే రూ.5.70 చూపిస్తోందని సూర్యాపేటలో ఓ వినియోగదారుడు తెలిపాడు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ మోహన్ బాబు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 500పైనే బంకులున్నాయి.
Similar News
News September 7, 2024
NLG: మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు!
జిల్లాలో గతంలో మాదిరి ఈసారి కూడా పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు జరుపనున్నారు. ఇందుకు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు ఇప్పటికే సమకూర్చారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు సిబ్బందిని తీసుకుంటున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి ఎన్నికల విధులకు అధికారులను, సిబ్బందిని ఎంపిక చేసేందుకు ఆయా శాఖల నుంచి ఉద్యోగుల, అధికారుల వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభించారు
News September 7, 2024
26 నుంచి MGU MED, BED సెమిస్టర్ పరీక్షలు
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఎంఈడి, బీఈడీ కళాశాలలో చదివే విద్యార్థులకు సెమిస్టర్ 2 రెగ్యులర్ పరీక్షలను ఈనెల 26 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించనున్నట్లు సిఓఈ ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల షెడ్యూళ్లను ఆయన విడుదల చేశారు. వర్సిటీ వెబ్సైట్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
News September 7, 2024
NLG: ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నిర్వహించుకోవాలి: జిల్లా కలెక్టర్
వినాయక చవితి సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి నల్గొండ జిల్లా ప్రజలకు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఆది దేవుడైన వినాయకుడు సర్వవిఘ్నాలను తొలగించి జిల్లా ప్రజలకు మంచి చేకూర్చాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలందరూ మట్టి గణపతులను పూజించాలని, భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలను నిర్వహించుకోవాలని తెలిపారు.