News May 12, 2024
నల్గొండ: పెద్ద మనుషులుగా వచ్చి కొట్టి చంపారు

నల్గొండలో భార్యాభర్తల మధ్య గొడవ హత్యకు దారి తీసింది. నల్గొండ వన్ టౌన్ సీఐ తెలిపిన సమాచారం మేరకు.. గుంటూరుకి చెందిన సయ్యద్ వలి (40) ఆరేళ్లుగా నల్గొండలో అడ్డా కూలిగా పనిచేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన హాజీ బేగంతో వివాహం జరిగింది. సయ్యద్ వలి మద్యం తాగుతుండడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సర్ది చెప్పడానికి వచ్చిన పెద్ద మనుషులు కర్రతో దాడి చేయడంతో వలి మరణించాడు.
Similar News
News February 9, 2025
NLG: అంతటా రిజర్వేషన్లపైనే చర్చ..!

పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఓవైపు అధికారులు యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తుంటే.. మరోవైపు కీలకమైన రిజర్వేషన్లపై ఇంకా ఉత్కంఠ వీడటం లేదు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా? లేదా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తుందా..? అనే దానిపై జిల్లా అంతటా ఆసక్తి నెలకొంది. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
News February 9, 2025
నల్గొండ: బస్సులో రూ.23 లక్షల చోరీ

నల్గొండ జిల్లాలో భారీ చోరీ జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడి బ్యాగు నుంచి రూ.23 లక్షలను ఎత్తుకెళ్లారు. నార్కెట్‌పల్లి వద్ద ఓ హోటల్‌లో టిఫిన్ చేసేందుకు ప్రయాణికులు దిగారు. అనంతరం బ్యాగు చూసుకుంటే మాయమైనట్లు బాధితుడు తెలిపాడు. దీంతో నార్కెట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News February 9, 2025
NKP: చెర్వుగట్టులో ఘనంగా పూర్ణాహుతి

చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి, ఏకాంత సేవలను వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, ఆర్చక బృందం ఆధ్వర్యంలో మహా పూర్ణహుతి, హోమం, ధ్వజారోహణం, ఏక దశ రుద్రాభిషేకం, జ్యోతి లింగార్చన, ఏకాంతసేవ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆయల ఈఓ నవీన్ కుమార్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.