News July 27, 2024
నల్గొండ: పెరుగుతున్న సర్పంచుల ఆశావహులు
గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమయ్యారు. నల్గొండ జిల్లాలో 844, యాదాద్రి జిల్లాలో 421, సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలున్నాయి. తాజా మాజీ సర్పంచులతోపాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన వారు సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు.
Similar News
News October 11, 2024
NLG: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి
ఉమ్మడి నల్గొండలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా మేనిఫెస్టో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురంలో కొడారి లతమల్లేశ్ ముందస్తు సర్పంచ్ ఎలక్షన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. గ్రామస్థులకు ఉచిత మంచినీటిని, ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.
News October 11, 2024
నల్గొండ: తెల్లబోతున్న పత్తి రైతులు..!
పత్తికి సరైన ధర దక్కక రైతులు దిగులు చెందుతున్నారు. ఏటా పెట్టుబడి బారం, సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో సరిగా వర్షాలు పడక.. కాలం కలిసి రాక దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. వచ్చిన ఆ కొద్ది పాటి పంటను తీసుకుందామంటే వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి తడిచి చేనులోనే మొలకలు వస్తు న్నాయి. క్వింట పత్తి మొదట రూ.7000 -8000 ఉండగా.. ప్రస్తుతం రూ.5000-6000 కే పరిమితం అయింది.
News October 11, 2024
నల్గొండ: 11 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులకు టీచర్ ఉద్యోగాలు
డీఎస్సీ -2024 పరీక్ష ఫలితాలు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. నల్గొండ జిల్లాలోని 11 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలు చేస్తూ డీఎస్సీ-2024కు ఎంపికయ్యారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో పారిశుద్ధ్య, నీటి సరఫరా, మొక్కల పెంపకం, ధ్రువీకరణ పత్రాలు, వీధి దీపాల నిర్వహణ చేసేవారు. ఎంపికైన 11 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇకపై విద్యార్థులకు బడిలో పాఠాలు చెప్పనున్నారు.