News December 28, 2024

నల్గొండ పొలిటికల్ రౌండప్ @2024

image

కాంగ్రెస్‌కి నల్గొండ 2024లో కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు 11 గెలవడంతో పాటు రెండు ఉత్తమ్, కోమటిరెడ్డికి మంత్రి పదవులు దక్కడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందన్నారు. మరో వైపు BRS SRPT స్థానాన్ని గెలుచుకుని ప్రస్తుతం పట్టుకోసం ప్రయత్నిస్తోందంటున్నారు. రాజకీయంగా ఎదగడానికి బీజేపీ, కమ్యూనిస్టులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. COMMENT

Similar News

News November 24, 2025

నల్గొండ జిల్లాలో బీసీలకు తగ్గిన స్థానాలు

image

నల్గొండ జిల్లాలో రిజర్వేషన్ల కేటాయింపులో రొటేషన్ విధానం బీసీలను దెబ్బతీసింది. 2019 ఎన్నికలతో పోలిస్తే భారీ ఎత్తున బీసీ రిజర్వేషన్లు తగ్గిపోవడంపై బీసీల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆదివారం ఆర్డీఓల ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సర్పంచ్ రిజర్వేషన్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 869 జీపీలు ఉండగా.. ఇందులో బీసీలకు 140 (2019లో 164) స్థానాలు రిజర్వ్ అయ్యాయి.

News November 24, 2025

ఎన్ఎంఎంఎస్ పరీక్ష.. 1,444 మంది హాజరు

image

నల్గొండ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు 1,444 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. 1,504 మందికి గాను 60 మంది గైర్హాజరయ్యారు. 16 మంది ఎంఈవోలు, 8 మంది సెట్టింగ్స్ స్క్వాడ్, రెవెన్యూ సిబ్బందిని నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.