News February 26, 2025
నల్గొండ: పోలింగ్ సెంటర్లకు తరలిన సిబ్బంది

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణకు పోలింగ్ సిబ్బంది నల్గొండ నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలారు. బుధవారం నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నికల సామాగ్రిని అధికారులు పోలింగ్ సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఎన్నికల సామాగ్రితో సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూట్ బస్సులలో బయలుదేరారు.
Similar News
News October 14, 2025
NLG: బాలాజీ నాయక్ పై ఫిర్యాదుల వెల్లువ

అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీనాయక్పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 112 ఫిర్యాదులు అందాయి. గుడిపల్లి పోలీస్ స్టేషన్కు బాధితులు అప్పు పత్రాలు, ఖాళీ చెక్కులతో తరలివచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 185 మంది బాధితులు బాలాజీపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్యాంపును ఏఎస్పీ మౌనిక పర్యవేక్షించారు.
News October 14, 2025
రూ.20తో రూ.2లక్షల బీమా: కలెక్టర్ ఇలా త్రిపాఠి

వాహనాల ద్వారా స్వల్పకాలిక పనులు చేసే వారందరూ జీవిత బీమా సౌకర్యాన్ని కలిగి ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకుగాను వివిధ బ్యాంకులు రూ.2 లక్షలతో వివిధ రకాల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు. సంవత్సరానికి కేవలం రూ.20 చెల్లిస్తే బీమా వర్తిస్తుందన్నారు. కార్మికులందరికీ ప్రమాద బీమా వర్తింపజేసేందుకు శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
News October 13, 2025
ఇసుక తవ్వకాలపై నివేదిక కోరిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

జిల్లాలోని ఇసుక తవ్వకాలకు సంబంధించి కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను నివేదిక కోరారు. నీటిపారుదల, గనులు, భూగర్భ జల వనరులు, టీఎస్ ఎంఐడీసీ, అటవీ, రెవెన్యూ, ముఖ్య ప్రణాళిక అధికారి శాఖల నుంచి ఇసుక తవ్వకాలపై నివేదికలను అందించాలని ఆదేశించారు. ఆయా శాఖలు సమర్పించిన నివేదికలన్నింటిని పూర్తిస్థాయి జిల్లా సమగ్ర నివేదికగా మార్చి అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.