News February 8, 2025

నల్గొండ పోలీసులకు తలనొప్పిగా పిల్లి కేసు!

image

పిల్లి పెట్టిన లొల్లి NLG పోలీసులకు తలనొప్పిగా మారింది. స్థానిక రహమత్ నగర్‌కు చెందిన పుష్పలత పెంచుకుంటున్న పిల్లి ఏడాదిక్రితం తప్పిపోగా PSలో ఫిర్యాదు చేశారు. పక్కింట్లో అదే పోలికలతో ఉన్న పిల్లి కనిపించగా ఆపిల్లి తమదేనని, పక్కింటి వారు ఎత్తుకెళ్లారంటూ Jan15న 2టౌన్‌ PSలో పుష్పలత కేసు పెట్టింది. పోలీసులు పిల్లి వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిచారు. పిల్లి ఎవరికి చెందుతుందో తేలాల్సి ఉంది.

Similar News

News December 7, 2025

సిరిసిల్ల: ఆల్ట్రా మారథాన్ రన్ లో పాల్గొన్న జిల్లా కానిస్టేబుల్

image

రాజస్థాన్లో నిర్వహించిన 100 కిలోమీటర్ల అంతర్జాతీయ ప్రమాణాల ఆల్ట్రా మారథాన్ రన్ లో జిల్లాకు చెందిన ఆర్ముడు రిజర్వ్ కానిస్టేబుల్ అనిల్ యాదవ్ పాల్గొన్నారని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. 100 కిలోమీటర్లు సాగిన ఈ రన్ లో అపారమైన ధైర్య సాహసాలు, శారీరక, మానసిక దృఢత్వాన్ని కానిస్టేబుల్ అనిల్ యాదవ్ ప్రదర్శించాడన్నారు. ఇటువంటి ఈవెంట్లో పాల్గొనడం ద్వారా యువ సిబ్బందికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు.

News December 7, 2025

వరంగల్ ఎనుమాముల మార్కెట్ రేపు పునఃప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునఃప్రారంభం కానుంది. వారాంతపు సెలవుల కారణంగా నిన్న, ఈరోజు మార్కెట్ బంద్ ఉంది. రేపు ఉదయం 6 గంటల నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.

News December 7, 2025

సమ్మిట్ ఆహూతులకు స్పెషల్ బొనాంజా

image

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. 44 దేశాలనుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. రేపు 1.30కు సమ్మిట్‌ను గవర్నర్ ప్రారంభిస్తారు. CM 2.30కు ప్రసంగిస్తారు. TG సంస్కృతి, HYD ఆధునికత ఉట్టిపడేలా ప్రతినిధులకు స్వాగతం, ప్రసిద్ధ వంటకాలతో ఆతిథ్యం అందిస్తారు. సమ్మిట్ ఎప్పటికీ గుర్తుండేలా ప్రత్యేక సావనీర్, వివిధ పిండివంటలతో కూడిన బాస్కెట్‌ను ఆహూతులకు అందించనున్నారు.