News March 13, 2025
నల్గొండ: పోలీస్ శాఖకు టీం స్పిరిట్ చాలాముఖ్యం: కలెక్టర్

పోలీస్ శాఖకు టీంస్పిరిట్ చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను గురువారం ఎస్పీ శరత్ చంద్ర పవర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం ఒత్తిడితో చేసే ఉద్యోగమని.. శారీరక స్ఫూర్తితో పాటు మానసికంగా అలర్ట్ కావడానికి క్రీడలు ఉపయోగపడతాయన్నారు.
Similar News
News February 11, 2026
నల్గొండలో మరి కాసేపట్లో పోలింగ్

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సహా మిర్యాలగూడ, చండూరు,హాలియా, దేవరకొండ, నందికొండ,చిట్యాల పురపాలికల్లో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 162 వార్డుల పరిధిలో 475 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 3,09,097 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News February 10, 2026
ఇందిరమ్మ ఇళ్లు వెంటనే పూర్తి చేయాలి: గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ

నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. నల్గొండ కలెక్టరేట్‌లో ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇళ్ల అప్పగింతకు ముందే విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి సౌకర్యాలు 100 శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు.
News February 10, 2026
మున్సిపల్ సమరానికి సర్వం సిద్ధం: నల్గొండ కలెక్టర్

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఈనెల 11న జరిగే ఎన్నికల సరళిపై మంగళవారం ఆయన ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి సమీక్షించారు. జిల్లాలో నల్గొండ కార్పొరేషన్‌తో పాటు మిర్యాలగూడ, చండూరు, చిట్యాల, నందికొండ, హాలియా, దేవరకొండ మున్సిపాలిటీల్లో మొత్తం 473 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.


