News July 11, 2024
నల్గొండ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఫుడ్ కోర్టు!

నల్గొండ జిల్లా కేంద్రంలో సుమారు రూ.కోటి వ్యయంతో ఫుడ్ కోర్టు ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్డులో బీట్ మార్కెట్ యార్డుకు వెళ్లే ప్రధాన మార్గంలో ఫుడ్ కోర్టు నిర్మాణాలకు స్థలం కేటాయించారు. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. వారం పది రోజుల్లో ఫలహారశాల నిర్మాణాలకు మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Similar News
News September 12, 2025
అధిక ధరకు యూరియా విక్రయిస్తే చర్యలు: ఎస్పీ

యూరియాను అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియాను సకాలంలో అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీపై సరఫరా అవుతున్న యూరియాను ఎవరైనా అధిక ధరకు విక్రయిస్తే, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News September 12, 2025
నల్గొండ: 15న ప్రజావాణి రద్దు

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నందున ఈ సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
News September 12, 2025
NLG: ‘డ్వాక్రా’కు బతుకమ్మ కోక!

ఇందిరమ్మ చీరల పేరుతో SHG సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చీరలను ఈ నెల 22 నుంచి ఉచితంగా అందించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేసింది. దీంతో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఏడాది పొదుపు సంఘాల మహిళలకు చీరలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. నల్లగొండ జిల్లాలో 3,66,532 మంది SHG సభ్యులు ఉన్నారు. వీరికి రెండు చీరలు చొప్పన ఇచ్చేందుకు జిల్లా అధికారులు ఇండెంట్ పంపారు.