News July 11, 2024

నల్గొండ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఫుడ్ కోర్టు!

image

నల్గొండ జిల్లా కేంద్రంలో సుమారు రూ.కోటి వ్యయంతో ఫుడ్ కోర్టు ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్డులో బీట్ మార్కెట్ యార్డుకు వెళ్లే ప్రధాన మార్గంలో ఫుడ్ కోర్టు నిర్మాణాలకు స్థలం కేటాయించారు. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. వారం పది రోజుల్లో ఫలహారశాల నిర్మాణాలకు మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Similar News

News February 10, 2025

నల్గొండ: బైక్‌తో గేదెను ఢీకొని వ్యక్తి మృతి

image

కొండమల్లేపల్లి మండలం గుమ్మడవల్లి గ్రామ పరిధిలో ఆదివారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా.. గుర్రంపోడు మండలం మునింఖానిగూడెం గ్రామానికి చెందిన కృష్ణ (27) మల్లేపల్లి నుంచి వస్తున్నాడు. ఈ క్రమంలో బైక్‌ గేదెను ఢీకొట్టింది. తలకు తీవ్రగాయలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

News February 10, 2025

NLG: రేపు ముసాయిదా జాబితా విడుదల

image

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. NLG జిల్లాలో 33 ZPTCలు, 352 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

News February 10, 2025

నల్గొండ: ఉరి వేసుకుని యువకుడి సూసైడ్

image

నల్గొండ కలెక్టర్ ఆఫీస్ వెనుక ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద మహిళా ప్రాంగణం రెడ్డి కాలనీకి చెందిన వంశీ అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం కొండగడప. అతను నల్గొండ మహిళా ప్రాంగణం వద్ద ఉన్న లిక్కర్ కంపెనీలో హమాలీగా పని చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!