News December 21, 2024

నల్గొండ ప్రజలకు విషమిచ్చి చంపండి: కోమటిరెడ్డి

image

CM రేవంత్‌ మూసీని అభివృద్ధి చేసి NLG జిల్లా ప్రజల బాగు కోరుతుంటే బావబామ్మర్దులు(కేటీఆర్, హరీశ్‌రావు) అడ్డుపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో ఫైరయ్యారు. తాము బతకాలని లేకుంటే విషమిచ్చి చంపండని అసహనం వ్యక్తం చేశారు. గత పదేళ్ల నుంచి నల్గొండ జిల్లాకు ఒక్క ఎకరాకు కూడా ఎక్కువగా ఇరిగేషన్ వాటర్ ఇవ్వలేదన్నారు. ఏ ఒక్క సాగు నీటి ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించిన దాఖలాలు లేవన్నారు.

Similar News

News April 10, 2026

నల్గొండ: లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి – కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పెండింగ్ లేకుండా వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇంజనీరింగ్ అధికారులను హెచ్చరించారు.

News April 10, 2026

NLG: చిగురిస్తున్న ‘చేయూత’ ఆశలు

image

జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2 లక్షల మందికి ‘చేయూత’ పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జరిగిన ‘ప్రజా పాలన’ ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 82,115 దరఖాస్తులు అందగా, ప్రస్తుతం అధికారులు అర్హతలను బట్టి వడపోత ప్రక్రియను వేగవంతం చేశారు. ఒక్కో జిల్లాకు సుమారు 10 వేల నుంచి 15 వేల వరకు కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉంది.

News April 10, 2026

NLG: మీరు గేదెల పథకానికి దరఖాస్తు చేయలేదా?

image

జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాడి రైతులకు ప్రభుత్వం మరో అద్భుత అవకాశం కల్పించింది. రివైజ్డ్ ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద అమలు చేస్తున్న రెండు పాడి గేదెల పథకం దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంకెందుకు ఆలస్యం? అర్హులైన వారు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.