News July 11, 2024

నల్గొండ: ప్రేమ పేరుతో వేధింపులు యువతి సూసైడ్

image

ప్రేమ వేధింపులతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. చింతలగూడానికి చెందిన కళ్యాణి(19)ని అదే గ్రామానికి చెందిన శివ, మధు అనే ఇద్దరు యువకులు ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తున్నారు. ప్రేమించకుంటే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈనెల 6న కళ్యాణికి ఫోన్లు చేస్తూ వేధించసాగారు. దీంతో కళ్యాణి పురుగు మందు తాగింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News November 22, 2025

NLG: ‘ఉచిత మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోండి’

image

నల్గొండ జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు వెంటనే ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీడీడీ (SCDD) డిప్యూటీ డైరెక్టర్ శశికళ కోరారు. 9, 10 తరగతులు చదువుతున్న పేద దళిత విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ. 3,500 బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని ఆమె తెలిపారు. అర్హులైన 3080 మంది విద్యార్థులు మీ-సేవ ద్వారా క్యాస్ట్, ఇన్‌కమ్, ఆధార్ వివరాలతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 21, 2025

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ: కలెక్టర్

image

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంపై శుక్రవారం ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 22న జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో చీరల పంపిణీకి వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలను పంపిణీ చేయాలన్నారు. గ్రామస్థాయిలో కార్యదర్శి జిల్లా కలెక్టర్ నామినీగా ఉంటారన్నారు