News March 26, 2024
నల్గొండ: ఫస్ట్ నుంచి కొనుగోళ్లు షురూ
ఉమ్మడి జిల్లాల్లో ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగాలు సన్నద్ధమవుతున్నాయి. రైతులు ధాన్యం తీసుకువస్తే రెండు, మూడు రోజులు ముందుగానే కేంద్రాలు తెరవడానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోళ్లపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేసింది.
Similar News
News November 4, 2024
మిర్యాలగూడలో బయటపడిన పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం
మిర్యాలగూడ సీతారాంపురం కాలనీ రామాలయం వీధిలో ఓ వ్యక్తి గొయ్యి తవ్వుతుండగా ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. విగ్రహానికి కాలనీవాసులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. అక్కడ గుడి నిర్మించాలని కాలనీవాసులు భావిస్తున్నారు. విగ్రహాన్ని చూడడానికి స్థానికులు బారులు తీరారు.
News November 3, 2024
యాదాద్రి: కుటుంబ సర్వే వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి: కలెక్టర్
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని కలెక్టర్ హనుమంతు రావు అన్నారు. ఇంటింటా సమగ్ర సర్వే ఈనెల 6న ప్రారంభం, 15రోజుల్లో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 2,47,354 ఇళ్లు.. 1938 మంది ఎన్యుమరేటర్లు నియామకమయ్యారన్నారు. పీఎస్‌ల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లతో సర్వే చేస్తున్నామన్నారు. సర్వే పూర్తయిన ప్రతీ ఇంటికి స్టిక్కర్ వేయాలన్నారు.
News November 3, 2024
వచ్చే ఏడాది మే నాటికి 4,000 మెగావాట్లు గ్రిడ్‌కు అనుసంధానం: Dy.CM
యాదాద్రి పవర్ స్టేషన్‌ను వచ్చే ఏడాది మే నాటికి పూర్తిచేసి 4000 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో మంత్రుల బృందం ఆదివారం పర్యటించింది. యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్లో విద్యుత్తు ఉత్పత్తి గ్రిడ్‌కు అనుసంధానం చేసే కార్యక్రమం విజయవంతమైందని డిప్యూటీ CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు.