News February 27, 2025

నల్గొండ: ఫోన్ పే, గూగూల్ పే ద్వారా బస్ టికెట్

image

TGSRTC బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఐ-టిమ్స్ మెషీన్లను ప్రవేశపెట్టనుంది. తొలి విడతలో భాగంగా 310 మెషీన్లను కొనుగోలు చేసింది. దీంతో నల్గొండ రీజియన్‌లోని నార్కట్ పల్లి, నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ డిపోల ప్రయాణికులకు చిల్లర బాధలు తప్పనున్నాయి.

Similar News

News February 25, 2026

దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్‌ఎస్

image

జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త డా.మాతృనాయక్ బుధవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులు, ల్యాబ్ పరీక్షలను పరిశీలించి, ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సూపరింటెండెంట్ డా. రవిప్రకాశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News February 25, 2026

నల్గొండ: యువతను డ్రగ్స్ నుంచి కాపాడాలి: కలెక్టర్

image

జిల్లాలో డ్రగ్స్ నివారణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను పాడుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

News February 25, 2026

నల్గొండ: నిధుల లేమితో డీఆర్డీఏ సతమతం

image

నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఖజానా ఖాళీ కావడంతో ఆరు నెలలుగా సుమారు రూ.60 వేల విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. ఎప్పుడు కరెంటు కోత విధిస్తారోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కనీసం స్టేషనరీ ఖర్చులకు కూడా నిధులు లేకపోవడంతో కార్యాలయ నిర్వహణ భారంగా మారింది.