News February 9, 2025

నల్గొండ: బస్సులో రూ.23 లక్షల చోరీ

image

నల్గొండ జిల్లాలో భారీ చోరీ జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడి బ్యాగు నుంచి రూ.23 లక్షలను ఎత్తుకెళ్లారు. నార్కెట్‌పల్లి వద్ద ఓ హోటల్‌లో టిఫిన్ చేసేందుకు ప్రయాణికులు దిగారు. అనంతరం బ్యాగు చూసుకుంటే మాయమైనట్లు బాధితుడు తెలిపాడు. దీంతో నార్కెట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News February 12, 2026

NLG: స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత!

image

నల్గొండ జిల్లా 3 కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద పోలీసులు మూడంచెల భద్రత కల్పించారు. బ్యాలెట్ బాక్సుల వద్ద మొదటి స్టేజీలో తెలంగాణ స్పెషల్ రిజర్వుడ్ పోలీసులతో భద్రత కల్పిస్తుండగా, రెండో స్టేజీలో ఏఆర్ పోలీసులు, మూడో స్టేజీలో సివిల్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.

News February 12, 2026

NLG: మూడు చోట్ల కౌంటింగ్.. రేపు తేలనున్న భవితవ్యం

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 13న జరగనుంది. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్ తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి 3 చోట్ల ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 478 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను అధికారులు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఈ నెల 13న అభ్యర్థుల భవితవ్యం తేరనున్నది.

News February 11, 2026

నల్గొండ: ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్: కలెక్టర్

image

కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను తనిఖీ చేస్తున్నారు. పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాల, బోయవాడలోని మోడల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే 18004251442 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.