News May 20, 2024
నల్గొండ: బెస్ట్ అవైలబుల్ స్కీం.. 114 సీట్లు మంజూరు

2024-25 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకం కింద జిల్లాకు 114 సీట్లు మంజూరైనట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 103 సీట్లు ST ఉపకులాలకు, 11 సీట్లు PTG (చెంచు) కులముల వారికి కేటాయించడం జరిగినది. మొత్తం సీట్లలో 33% బాలికలకు కేటాయిస్తూ (3వ తరగతి వారికి 50%) (5వ తరగతి వారికి 25%), (8వ తరగతికి 25%) సీట్లను తరగతి వారీగా కేటాయించినట్లు తెలిపారు.
Similar News
News October 24, 2025
నల్గొండ: 154 వైన్ షాపులకు 4,905 దరఖాస్తులు

నల్గొండ జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని 154 వైన్ షాపుల కోసం మొత్తం 4,905 టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో నల్గొండ డివిజన్లో అత్యధికంగా 1,417, మిర్యాలగూడలో 988, దేవరకొండలో 621, హాలియాలో 509, నకిరేకల్లో 512, చండూరులో 398 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
News October 24, 2025
నేరాల అదుపునకు ప్రత్యేక దృష్టి: నల్గొండ ఎస్పీ

నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా పనిచేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలని, పోక్సో సహా కీలక కేసుల్లో విచారణ వేగవంతం చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని, సైబర్ నేరాలు, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెంచాలని ఆదేశించారు.
News October 23, 2025
నల్గొండ: తండ్రి మందలించాడని సూసైడ్

చిట్యాల మండలం చిన్నకాపర్తికి చెందిన యువకుడు రుద్రారపు చందు (25) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చందు ట్రాక్టర్ మెకానిక్. ప్రతిరోజు చిట్యాలకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు. దీంతో తండ్రి మందలించగా మనస్తాపానికి గురై పురుగు మందు తాగాడు. పెద్దకాపర్తి సబ్ స్టేషన్ వద్ద పడి ఉండగా ఆసుపత్రిలో చేర్పించగా గురువారం మృతి చెందాడు.


