News July 3, 2024

నల్గొండ: మండలాలకు ప్రత్యేక అధికారులు కేటాయింపు

image

నిడమానూరు – V. శ్రీనివాస రావు, పీఏ పల్లి – నాగమల్లేశ్వరరావు, పెద్దవూర – వెంకటయ్య, శాలిగౌరారం – రామారావు నాయక్, తిప్పర్తి – R. దస్రు, తిరుమలగిరి సాగర్ – R. కిరణ్ కుమార్, త్రిపురారం – V. లీల, వేములపల్లి – B. శ్రీనివాసరావు, కట్టంగూర్ – విజయేందర్ రెడ్డి, కనగల్ – V. శ్రీనివాస్, గుర్రంపోడు – V.వెంకటేశ్వర్లు, గుండ్రంపల్లి – M. వీరప్ప, దేవరకొండ – ఇందిరా, చిట్యాల – P. శ్రీనివాస్ కుమార్ ను కేటాయించారు.

Similar News

News October 20, 2025

మంత్రి కోమటిరెడ్డి దీపావళి విషెస్

image

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని ‘జ్ఞాన వెలుగులు నింపే పండుగ’గా ఆయన అభివర్ణించారు. దీపాలు చీకటిని తరిమినట్టుగానే, ఈ పండుగ ప్రజల జీవితాల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ప్రతి ఇంట్లో సకల శుభాలు కలిగించాలని కోరారు.

News October 20, 2025

నల్గొండ: పత్తి కూలీల ఆటో, ట్రాక్టర్ ఢీ

image

ముప్పారంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకంలో ముంచింది. పత్తికూలీల ఆటోను ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో ఆలంపల్లి సాయిలు అనే కూలీ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో 8 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను 108లో మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.

News October 20, 2025

నల్గొండ: రేకుల షెడ్‌లో ఉంటున్నాం.. ఇల్లు ఇవ్వరూ..!

image

త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు దక్కడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా నాయకులు అనర్హులకు ఇళ్లను కేటాయించి తమను విస్మరిస్తున్నారని కొల్లి సరస్వతి, దుర్గయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేకుల షెడ్‌లో నివసిస్తున్నామని, అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.