News March 31, 2025
నల్గొండ: మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పరిధిలోని తెరాటిగూడెంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హత్య చేశాడో భర్త. రోజూ తాగి వస్తున్న భర్తతో భార్య అరుణ(35) సోమవారం గొడవకు దిగింది. దీంతో ఆవేశానికి గురైన భర్త గొడ్డలితో ఆమెపై దాడి చేయడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 17, 2025
ఖమ్మం: ‘ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి’

ఖమ్మం జిల్లా గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం TG-CET 2026 నిర్వహించనున్నట్లు DCO సిహెచ్.జ్యోతి తెలిపారు. పరీక్ష ఫిబ్రవరి 22 (ఆదివారం) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఉచిత విద్య, వసతి, భోజనం అందించే ఈ గురుకులాల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు జనవరి 21వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
News December 17, 2025
MRO హబ్‌గా భోగాపురం అభివృద్ధి: రామ్మోహన్ నాయుడు

భోగాపురాన్ని సౌత్ ఈస్ట్ ఆసియాలోనే కీలకమైన ఎయిర్‌క్రాఫ్ట్స్ మెయింటెనెన్స్, రిపేర్లు&ఓవర్‌హాలింగ్ (MRO) సెంటర్‌గా అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అమెరికా, చైనా తర్వాత ఏవియేషన్ మార్కెట్లో భారత్ 3వ స్థానంలో ఉందన్నారు. భారత ఏవియేషన్ రంగానికి భోగాపురం కీలక కేంద్రంగా మారనుందని, ఏవియేషన్ ఎడ్యుసిటీకి ఆనుకుని 500 ఎకరాలను MRO కార్యకలాపాల కోసం కేటాయించినట్లు ఆయన చెప్పారు.
News December 17, 2025
ఆస్కార్ 2026 షార్ట్‌లిస్ట్‌లో ‘హోమ్‌బౌండ్’

భారతీయ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్‌బౌండ్’ మూవీ 98వ అకాడమీ అవార్డులలో ‘ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో టాప్-15లో చోటుదక్కించుకుంది. కేన్స్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఆస్కార్ రేసులోకి దూసుకెళ్లింది. పోలీస్ అవ్వాలనుకునే ఇద్దరు స్నేహితులకు ఎదురైన సవాళ్లే ఈ మూవీ కథ.


