News March 31, 2025
నల్గొండ: మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పరిధిలోని తెరాటిగూడెంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హత్య చేశాడో భర్త. రోజూ తాగి వస్తున్న భర్తతో భార్య అరుణ(35) సోమవారం గొడవకు దిగింది. దీంతో ఆవేశానికి గురైన భర్త గొడ్డలితో ఆమెపై దాడి చేయడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 23, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓కొత్తగూడెం: రామవరంలో కార్డెన్ సెర్చ్
✓జిల్లా వ్యాప్తంగా రోడ్లకు మరమ్మతులు చేయాలి: కలెక్టర్
✓జిల్లావ్యాప్తంగా కొమరం భీమ్ జయంతి వేడుక
✓పినపాక: రెండు బైక్ లు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
✓BASలో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
✓డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టండి: ఇల్లందు డీఎస్పీ
✓ఈనెల 24న పాల్వంచ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
✓మణుగూరు: సురక్ష బస్టాండ్లో పోలీసుల తనిఖీలు
✓రోడ్లు బాగు చేయాలని BRSనిరసనలు
News October 23, 2025
PDPL: పత్తి రైతులకు కొత్త చిక్కులు.. స్లాట్ బుకింగ్ తప్పనిసరి

పత్తి పంట విక్రయించే రైతులకు సిసిఐ కొత్త నియమాలు తీసుకొచ్చింది. రైతులు తమ పత్తిని విక్రయించాలంటే వారం రోజుల ముందుగానే యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి. బుకింగ్ చేసిన తేదీ, సమయానికే కొనుగోలు కేంద్రాలకు రావాలని అధికారులు తెలిపారు. ఎక్కువసేపు క్యూలలో నిలబడి ఇబ్బంది పడకుండా ఉండడమే ఈ విధానం లక్ష్యమని సీసీఐ వెల్లడించింది. కాగా పెద్దపల్లి జిల్లాలో 49 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు.
News October 23, 2025
భద్రాద్రి: రోడ్డు ప్రమాద నివారణకు అధికారులు కృషి చేయాలి: కలెక్టర్

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు కృషి చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి అధికారులతో పాల్వంచ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాద నివారణకు అధికారులు సరైన ప్రణాళిక రూపొందించుకొని వాటిని అమలు చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలన్నారు.