News March 25, 2025
నల్గొండ: మరొకరికి మంత్రి పదవి!

మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. ఇటీవల అద్దంకి దయాకర్‌ను MLC పదవి వరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే SRPTకి చెందిన రమేశ్ రెడ్డిని పర్యాటక శాఖ ఛైర్మన్‌గా నియమించింది. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారు. దీంతో ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యం పెరిగినట్లైంది. జిల్లాకు మరో అమాత్య యోగముందా కామెంట్ చేయండి.
Similar News
News December 1, 2025
అనకాపల్లి: తుఫాను భయం.. రైతులకు సూచనలివే

దిత్వా తుఫాన్ నేపథ్యంలో రైతులు వరికోతలను రెండుమూడు రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి విజ్ఞప్తి చేశారు. పరిస్థితిలు అనుకూలించిన తర్వాత మాత్రమే కోతలు ప్రారంభించాలన్నారు. కోసిన వరి పనలు తడిస్తే నూర్చి ఎండలో ఎండ పెట్టాలన్నారు. ప్రతి క్వింటాల్ ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల ఊకపొడి కలపాలన్నారు. మొలకలు రాకుండా ఉండేందుకు ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాలన్నారు.
News December 1, 2025
చీడికాడ: గంజాయి కేసులో నలుగురికి 10 ఏళ్లు జైలు శిక్ష

చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో నమోదైన గంజాయి కేసులో నలుగురు నిందితులకు 10ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు, ఒక్కొక్కరికీ రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం.హరినారాయణ తీర్పు చెప్పినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన వివరాలు వెల్లడించారు. ధరావత్ రవి, మడ్డు నర్సింహరాజు, దాలిబోయిన ఫల్గుణ, బండారు సంతోష్‌లకు ఈ శిక్ష పడినట్లు చెప్పారు.
News December 1, 2025
కృష్ణా: తుఫాన్ ప్రభావంతో అపరాల సాగు ఆలస్యమే.!

దిత్వా తుఫాన్ ప్రభావం కృష్ణా డెల్టా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సాధారణంగా వరి కోత అనంతరం రెండో పంటగా సాగుచేసే అపరాల సాగుకు నవంబర్ నెలలోనే పనులు ప్రారంభమవుతాయి. అయితే తుఫాన్ నేపథ్యంతో వరికోతలు నిలిచిపోవడంతో, అపరాల సాగు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. రెండో పంట ఆలస్యమవ్వడంతో దిగుబడి కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


