News March 25, 2025
నల్గొండ: మరొకరికి మంత్రి పదవి!

మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. ఇటీవల అద్దంకి దయాకర్ను MLC పదవి వరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే SRPTకి చెందిన రమేశ్ రెడ్డిని పర్యాటక శాఖ ఛైర్మన్గా నియమించింది. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారు. దీంతో ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యం పెరిగినట్లైంది. జిల్లాకు మరో అమాత్య యోగముందా కామెంట్ చేయండి.
Similar News
News November 21, 2025
సంగారెడ్డి: ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రజలు ఆన్ లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ శుక్రవారం తెలిపారు. ఎవరైనా ఆన్ లైన్ మోసాలకు గురైతే 48 గంటల్లో 1930, https://www.cybercrime.gov.in వెబ్ సైట్లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 21, 2025
రేపు ప్రకాశం జిల్లాకు మోస్తరు వర్ష సూచన.!

దక్షిణ అండమాన్లో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. వ్యవసాయ మోటార్ల వద్ద రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలిగాలుల ప్రభావం పెరిగింది.
News November 21, 2025
ములుగు: ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను పెంపొందించడంలో శబరీష్ కృషి

ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ను మహబూబాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో నక్సలిజం అణిచివేత, డ్రగ్స్ నిర్మూలనతోపాటు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను పెంపొందించడంలో శబరీష్ చురుకైన పాత్రను పోషించారు. ఆయన సేవలను జిల్లా ప్రజలు కొనియాడుతున్నారు.


