News November 20, 2024
నల్గొండ: మరోసారి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు బంద్

నేటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం 3 విద్యా సంవత్సరాలుగా ఫీజు రీయంబర్స్మెంట్ బకాయి చెల్లించకపోవడంతో మూసివేయాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 65 ప్రైవేట్ కళాశాలలు నేటి నుంచి మూతపడనున్నాయి. రేపటి నుంచి జరిగే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించనున్నాయి. తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో నేటి నుంచి మళ్లీ పోరుబాట పట్టనున్నట్లు తెలిపారు.
Similar News
News October 26, 2025
NLG: లక్ ఎవరిని వరిస్తుందో..!

కొత్త మద్యం పాలసీ నిర్వహణకు వేలైంది. ప్రభుత్వం గత నెల 26 నుంచి ఈ నెల 23వరకు మద్యం టెండర్ల దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు 4,906 దరఖాస్తులు వచ్చాయి. లక్కీడ్రా పద్ధతిలో సోమవారం షాపులు కేటాయించనున్నారు. ఇందుకు నల్గొండలోని లక్ష్మీ గార్డెన్స్లో ఏర్పాట్లు చేస్తుండగా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సంతోష్ పరిశీలించారు.
News October 26, 2025
పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగానే: కోమటిరెడ్డి

రాష్ట్రంలో హ్యామ్ విధానంలో చేపట్టబోయే రూ.8 వేల కోట్ల రోడ్ల పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిప్పికొట్టారు. “పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది” అంటూ బీఆర్ఎస్ నేతల విమర్శలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాణ్యమైన రోడ్లు వేస్తుంటే ప్రతిపక్షం అడ్డుకుంటోందని ఆరోపించారు.
News October 26, 2025
నల్గొండ: మద్యం దుకాణాలకు ఈ నెల 27న డ్రా

2025- 27కు సంబంధించి నల్గొండ జిల్లాలోని 154 మద్యం దుకాణాలకు 4,906 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రమణ తెలిపారు. ఈనెల 27న ఉదయం 11 గంటలకు నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో గల లక్ష్మి గార్డెన్స్లో కలెక్టర్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల ఎంపిక లాటరీ ద్వారా జరుగుతుందన్నారు. డ్రా ప్రారంభ సమయంలో మీడియాకు అనుమతి లేదని, డ్రా పూర్తిగా ముగిసిన తర్వాత మీడియాకు వివరాలు అందజేస్తామన్నారు.


