News April 27, 2024
నల్గొండ: మరో ఎన్నికకు రంగం సిద్ధం

ఉమ్మడి నల్గొండ – ఖమ్మం – వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. కాగా తీన్మార్ మల్లన్న 2021లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. సూర్యాపేటకు చెందిన నరసింహా రెడ్డి, వరంగల్‌కు చెందిన రాకేశ్ రెడ్డి BRS తరఫున పోటీకి ఆసక్తి చూపతుండగా.. బీజేపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.
Similar News
News October 28, 2025
NLG: కొనుగోలు కేంద్రాలు సరే.. స్థలమేదీ..!

నల్గొండ జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. కోసిన ధాన్యం ఎక్కడ ఆరబెట్టాలో తెలియక రైతులు సతమతం అవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకూ సరిపడా స్థలం లేదు. పది నుంచి 20 రాశులు రాగానే స్థలం కొరత ఏర్పడుతోంది. ధాన్యం సేకరణకు జిల్లాలో ఇప్పటికే 85% ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో కేవలం కొన్ని కేంద్రాలకే అనువైన స్థలాలు ఉన్నాయి. మిగతా కేంద్రాలకు సరైన స్థలాలే లేవని రైతులు అంటున్నారు.
News October 27, 2025
నల్గొండలో 85% ధాన్యం కేంద్రాలు ప్రారంభం: కలెక్టర్

నల్గొండ జిల్లాలో ఈ వానాకాలం ధాన్యం సేకరణ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 85 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. దేవరకొండ, చండూరు డివిజన్లలో వరికోతలు ఆలస్యం కావడంతో, మిగిలిన కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. HYD నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత కలెక్టర్ ఈ వివరాలు తెలిపారు.
News October 27, 2025
బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి: నల్గొండ SP

ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 55 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


