News April 27, 2024

నల్గొండ: మరో ఎన్నికకు రంగం సిద్ధం

image

ఉమ్మడి నల్గొండ – ఖమ్మం – వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. కాగా తీన్మార్ మల్లన్న 2021లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. సూర్యాపేటకు చెందిన నరసింహా రెడ్డి, వరంగల్‌కు చెందిన రాకేశ్ రెడ్డి BRS తరఫున పోటీకి ఆసక్తి చూపతుండగా.. బీజేపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.

Similar News

News April 18, 2026

నల్గొండ: సర్పంచ్ కుమారుడి ‘పెత్తనం’పై కంప్లైంట్

image

సర్పంచ్ కుమారుడి వేధింపులు తాళలేకపోతున్నానంటూ చందంపేట మండలం గుంటిపల్లి పంచాయతీ కార్మికుడు నల్ల దేవరాజు శుక్రవారం కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కొడుకు అనధికారికంగా పెత్తనం చలాయిస్తూ, తాను విధులకు హాజరవుతున్నా గైర్హాజరు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల గత ఆరు నెలలుగా జీతం రాకుండా అడ్డుపడుతున్నారని, వెంటనే విచారణ జరిపి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కార్మికుడు వేడుకున్నారు.

News April 18, 2026

NLG: పాలిసెట్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) రాసే విద్యార్థులకు నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ కేవీ.నరసింహారావు తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి మే 11 వరకు తరగతులు జరుగుతాయన్నారు. మే 13న జరగనున్న పాలిసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు ఈనెల 18, 19వ తేదీల్లో కళాశాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

News April 18, 2026

అడవిదేవులపల్లిలో అత్యధికంగా ఉష్ణోగ్రత

image

జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటగా, అడవిదేవులపల్లిలో అత్యధికంగా 43 డిగ్రీలు నమోదైంది. ఈనెల 13 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. మే నెల చివరి వరకు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.