News March 13, 2025
నల్గొండ: మహిళలను వేధించే ఆకతాయిలపై షీ టీం నిఘా: SP

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేసే ఆకతాయిలపై షీ టీం నిఘా ఉంటుందని.. ఈనెల 14న శుక్రవారం నిర్వహించుకునే హోలీ వేడుకల్లో ఇతరులకు హాని కలిగించొద్దని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. హోలీ పండుగను జిల్లా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, కలిసి మెలిసి సంతోషంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 17, 2025
భువనగిరి కోటపైన రోప్ వే

భువనగిరి కోటపైన రోప్ వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. కి.మీ మేర దీనిని నిర్మించేందుకు పర్యాటక సంస్థ రూ.56.81 కోట్లతో టెండర్లను పిలిచింది. HYD-WGL హైవే నుంచి కోట వరకు ఈ రోప్ వే ఉండనుండగా రాష్ట్రంలో ఇది మొదటిది కానుంది. మరో నాలుగు రోప్ వేలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అందులో యాదాద్రి టెంపుల్, నల్గొండ హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట ఉన్నాయి.
News March 17, 2025
మిర్యాలగూడ: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం దామరచర్లలో జరిగింది. NLG రైల్వే ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల శివారులో విష్ణుపురం-కొండ్ర పోల్ రైల్వే స్టేషన్ల మధ్య యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్‌కు వెళ్లే రైల్వే గేట్ వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి ( సుమారు 45 ఏళ్లు ) రైలు కింద పడి మృతి చెందారు. మృతదేహాన్ని MLG ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
News March 17, 2025
నల్గొండ: ఫాస్ట్‌గా ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్

ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీ నుంచి అధికారులు పేపర్లు దిద్దుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అన్ని పేపర్లను కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజీలోనే వాల్యుయేషన్ చేస్తున్నారు. కాగా ప్రతీ గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఏప్రిల్ 10వ తేదీ నాటికి ప్రాసెస్ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు.