News March 13, 2025

నల్గొండ: మహిళలను వేధించే ఆకతాయిలపై షీ టీం నిఘా: SP

image

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేసే ఆకతాయిలపై షీ టీం నిఘా ఉంటుందని.. ఈనెల 14న శుక్రవారం నిర్వహించుకునే హోలీ వేడుకల్లో ఇతరులకు హాని కలిగించొద్దని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. హోలీ పండుగను జిల్లా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, కలిసి మెలిసి సంతోషంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News February 17, 2026

హాలియాలో ఘోర ప్రమాదం: దంపతుల మృతి

image

నల్గొండ హాలియా సాగర్ ఎడమ కాలువ వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ వాహనాన్ని లారీ వేగంగా ఢీకొనడంతో పెద్దవూర మండలం కొత్తగూడెంకు చెందిన భార్యాభర్తలు వెంకటయ్య(55), మల్లమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందారు. హాలియా నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సీఐ సతీష్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News February 17, 2026

మానవత్వం చాటుకున్న కోమటిరెడ్డి

image

నల్గొండ నుంచి HYD వెళుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. చిట్యాల సమీపంలోని గుండ్రాంపల్లి వద్ద జరిగిన ప్రమాదాన్ని చూసి వెంటనే తన కాన్వాయ్‌ను ఆపారు. క్షతగాత్రులను పరామర్శించి, తన వాహన శ్రేణిలోని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రిపై సర్వత్రా ప్రశంసలు కురిస్తున్నాయి.

News February 16, 2026

చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ జిల్లాలోని చెరువులు, కుంటల ఆక్రమణలపై కలెక్టర్ బి.చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రంలో ఆక్రమణలను గుర్తించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జలవనరులు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో కబ్జాలకు తావులేకుండా నిఘా పెంచాలని స్పష్టం చేశారు.