News March 22, 2025
నల్గొండ మహిళల కోసం జాబ్ మేళా

శ్రీ కాకతీయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో NLG ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. 10 తరగతి, ఇంటర్, డిగ్రీ, ITI, పాలిటెక్నిక్లో ఉత్తీర్ణులు లేదా ఫెయిల్ అయిన మహిళలు 18 సం.ల నుంచి 33 సంవత్సరాల లోపు వారు అర్హులని కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.శ్రీనివాసరాజు తెలిపారు.
Similar News
News November 2, 2025
పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

జిల్లాలోని ప్రైవేట్ పారామెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఎంహెచ్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. డీఎంపీహెచ్ఎ(మేల్), డీఎంఎల్, డీఓఏ, డీఏఎన్ఎస్, డీఎంఐటీ, డీఆర్జీఏ, డీఓఎం, డీఈసీజీ, డయాలసిస్, డిఎంఎస్టీతో పాటు ఇతర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 27లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 2, 2025
NLG: నజరానా ఇస్తాం.. షాపు ఇస్తారా?!

నల్గొండ జిల్లాలో నూతన మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి కావడంతో కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్న వారికి వ్యాపారులు బంపర్ ఆఫర్ చేస్తున్నారు. నజరానా ఇస్తాం.. షాపు ఇస్తారా.. అంటూ ప్రలోభపెడుతున్నారు. ఈసారి టెండర్లలో పాత మద్యం వ్యాపారులకు దురదృష్టం, కొత్త వారికి అదృష్టం కలిసి వచ్చింది. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు 4906 దరఖాస్తులు వచ్చిన విషయం విధితమే.
News November 2, 2025
NLG: కాగితాలపైనే అంచనా లెక్కలు… రైతులందరికీ సాయమందేనా?

ఆకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోతున్నారు. పంటల బీమా అమలుకు నోచుకోక ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాల్సిన అధికారులు కాగితాలపై అంచనా లెక్కనే వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సాగు విస్తీర్ణం డిజిటల్ క్రాప్ సర్వే మొక్కుబడిగానే నిర్వహించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సాగు విస్తీర్ణం నష్టం నమోదులోనూ అదే తీరు కనిపిస్తుందన్నారు.


